![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -954 లో...అనుపమ, మహేంద్ర ఇద్దరు కలిసి వసుధార దగ్గరకు వచ్చి.. నిన్ను శైలేంద్ర బ్లాక్ మెయిల్ చేసాడని ముందే ఎందుకు చెప్పలేదు అని మహేంద్ర అడుగుతాడు. మీకు చెప్తే వాడు రిషి సర్ ని ఏమైనా చేస్తాడేమోనని భయం వేసి చెప్పలేదని వసుధార చెప్తుంది.
అ తర్వాత అనుపమ మేడమ్ సమయస్పూర్తితో నన్ను ఫాలో అయి వీడియో తీసింది. అది ఇప్పుడు మనకి చాలా హెల్ప్ అవుతుంది. దీంతో అ శైలేంద్ర బయపడి రిషిని తీసుకోని వస్తాడని వసుధార చెప్తుంది. ఈ విషయం ముకుల్ కి చెప్పాలని అనుపమ ముకుల్ కి ఫోన్ చేసి.. శైలేంద్రే వసుధారని బ్లాక్ మెయిల్ చేసిన విషయం చెప్తుంది. ముకుల్ అది విని షాక్ అవుతాడు. ఇప్పటి వరకు శైలేంద్ర తప్పించుకున్నాడు ఇక మీద తప్పించుకోలేడని ముకుల్ అంటాడు. ఎందుకైన మంచిది మీరు అందరు జాగ్రత్తగా ఉండండి అని ముకుల్ చెప్తాడు. ఇప్పుడు శైలేంద్ర ఫోన్ ట్రాప్ లో ఉంది. ఎవరికి ఫోన్ చేసిన మొత్తం బయటపడుతుందని ముకుల్ అనుకుంటాడు. మరొక వైపు శైలేంద్ర వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని రిషిని కిడ్నాప్ చేసిన రౌడీలకి ఫోన్ చేస్తాడు. అ రౌడీ రిషి తప్పించుకున్నాడని చెప్పగానే శైలేంద్ర వాళ్లపై కోప్పడతాడు. మరొకవైపు వసుధార బ్రాస్ లైట్ చూస్తు బాధపడుతుంది. శైలేంద్ర దగ్గరకి ధరణి వచ్చి.. చెంపపై ఆ వాతలేంటని అడుగుతుంది. గొడ గీసుకుపోయిందని శైలేంద్ర అంటాడు. గోడ గీసుకుపోయినట్టు లేదు. ఎవరో కొట్టినట్టుంది అయిన మిమ్మల్ని ఎవరు కొడతారని ధరణి అంటుంది.
ఆ తర్వాత దేవయానికి రిషి తప్పించుకున్నాడని శైలేంద్ర చెప్పగానే.. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ సమస్య నుండి ఎలా బయటపడటమని దేవయాని టెన్షన్ పడుతుంటుంది. వసుధారని చంపేయ్యలని శైలేంద్ర చెప్తాడు. ఆ తర్వాత ఎవరో రౌడీతో శైలేంద్ర మాట్లాడుతాడు. మరొకవైపు అనుపమ, ముకుల్ , వసుధార ముగ్గురు.. రిషిని తీసుకొని శైలేంద్ర వస్తాడో లేక మరి ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నాడోనని మాట్లాడుకుంటారు. అ తర్వాత వసుధార, అనుపమ ఇద్దరు కార్ లో వెళ్తుంటే కొందరు రౌడీలు మేకులతో ఉన్న కర్రని రోడ్డుకి అడ్డంగా పెట్టడంతో వాళ్ళు వెళ్తున్న కార్ టైర్ పంచర్ అవుతుంది. దాంతో వాళ్ళు కార్ లో నుండి బయటకు వచ్చి.. ఏమైందని చూస్తారు. వాళ్ళ దగ్గరకి రౌడీలు వస్తారు. తరువాయి భాగంలో వసుధార, అనుపమలపై రౌడీలు ఎటాక్ చేస్తుంటే.. ఎవరో ఒకతను వచ్చి వాళ్ళని కాపాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |